తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల

20 Jun, 2021 19:57 IST|Sakshi

తెలుగు సినిమాలకు మార్కెట్‌ బాగా పెరిగింది. కొన్నాళ్లుగా టాలీవుడ్‌ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయి అక్కడ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. రీసెంట్‌గా మన తెలుగు పాటలకు బాలీవుడ్‌లో సీటీమార్‌ స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.  డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.

ఇక తెలుగులో సుశాంత్‌కు తల్లిగా నటించిన టబు పాత్రను బాలీవుడ్‌లో మనీషా కొయిరాల చేయనుందట. ఇప్పటికే మేకర్స్‌ ఆమెతో చర్చలు జరపగా, మనీషా కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్‌ మనీషా కొయిరాలకు దక్కిందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ రీమేక్‌ వెర్షన్‌ను అల్లు అరవింద్‌ సహా నిర్మాతగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : ‘అర్జున్‌ రెడ్డి’లా పవన్‌ కల్యాణ్‌.. ఓల్డ్‌ పిక్‌ వైరల్‌
ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా

మరిన్ని వార్తలు