Krishna Home Tour: ఊహించని రీతిలో సూపర్‌ స్టార్‌ ఇల్లు, చూస్తే అవాక్కవ్వాల్సిందే..

23 Jul, 2022 15:32 IST|Sakshi

ఇంద్రభవనాన్ని తలపిస్తోన్న కృష్ణ ఇల్లు.. కానీ అక్కడికి నో ఎంట్రీ

సూపర్‌ స్టార్‌ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంత పెద్ద స్టార్‌ అయినప్పటికీ కృష్ణ బయటకు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనను నటుడిగానే కాదు పర్సనల్‌గా కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ సింప్లిసిటీ ఆయనలో మాత్రమే కాదు, ఇంటిని కూడా అన్ని సౌకర్యాలతో చాలా సింపుల్‌గా నిర్మించుకున్నారు కృష్ణ. ఇటీవల కృష్ణ హోంటూర్‌ వీడియో ప్రోమోను ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె ఫుల్‌ వీడియోను వదిలారు ఆమె. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే హైదరాబాద్‌ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కృష్ణ ఇల్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, రకరకాల పూలు, పండ్ల తోటలతో పూర్తి ప్రకృతమయంగా ఇంటిని నిర్మించుకున్నారు కృష్ణ. ఇంట్లో అడుగడుగునా ఆయన అభిరుచి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే పచ్చని వనం, మధ్యలో కృష్ణుడి విగ్రహం.. వాటర్‌ ఫౌంటెన్‌ దాని చుట్టూ గులాబీ చెట్లు.. కొబ్బరి చెట్లు, పెరటిలో తులసి, ఆ పక్కనే విజయ నిర్మల గారి విగ్రహం ఇలా ఆహ్లాద వాతావరణాన్ని తలపిస్తోంది.

భాగ్య నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా కట్టుకున్న ఇల్లును చూసి ఫిదా అవుతున్నారంతా. మరో విశేషం ఏంటంటే ఇంటి వెనకాలే మామిడి తోట.. ఆకుకూరలు, కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. ఇక కుటుంబమంతా కలిసి సరదాగా గడిపేందుకు గార్డెన్‌లో, ఇంట్లో స్పెషల్‌ సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, ఇంటి లోపల హోం థియేటర్‌, స్మిమ్మింగ్‌ ఫూల్‌, ఇంట్లోనే పార్టీ చేసుకునేందుకు అన్ని హంగులతో నిర్మించుకున్న హాల్‌, పిల్లల కోసం ప్లేయింగ్‌ రూమ్స్‌ అన్నీ చక్కగా అమర్చి ఉండటంతో ఇది ఇంద్రభవనాన్ని తలపిస్తోంది.

లివింగ్‌ రూంలో ఎక్కడ చూసినా విజయ నిర్మల ఫొటోలు, విగ్రహాలు.. బంగారంతో చేయించిన ఆమె కాళ్లు.. కృష్ణ గెలుచుకున్న పతకాలు ఇలా ఎన్నింటినో చూపిస్తూ ఆసక్తికర అంశాలను షేర్‌ చేశారు మంజుల. లివింగ్‌ రూం వరకే చూపించి మొదటి అంతస్తులో నాన్న ఉంటారని, ప్రస్తుతం అక్కడికి నో ఎంట్రీ అని చెప్పారామె. కుదిరితే భవిష్యత్తులో చూపిస్తానన్నారు. మొత్తానికి ఆయన ఇంటిని చూస్తుంటే ఓ సుందరవనాన్ని తలపిస్తోంది. ప్రకృతిమయమైన రిసార్టును చూస్తున్న భావన కలుగుతోంది. ఇలా ఎన్నో విశేషాలతో ఆయన ఇల్లు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు