'మన్మథుడు' హీరోయిన్‌ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

6 Jun, 2021 13:52 IST|Sakshi

అన్షు అంబానీ.. ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ మన్మథుడు హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఈ సినిమాలో బేల చూపులతో అమాయకంగా మాట్లాడే ఆమె పాత్ర ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. కెమెరా మ్యాన్‌ కబీర్‌ లాల్‌.. అన్షును దర్శకుడు విజయ్‌ భాస్కర్‌కు పరిచయం చేశాడు. అలా ఆమె కింగ్‌ నాగార్జునతో 'మన్మథుడు'లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. 

2002లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టి అన్షుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఆమె ప్రభాస్‌తో 'రాఘవేంద్ర' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసిందీ భామ. తర్వాత 'జై' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్‌ ఆ తర్వాత చిత్రపరిశ్రమలో కనిపించకుండా పోయింది.

లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు రెండు సినిమాలతోనే సునామీ సృష్టించింది. కానీ ఇండస్ట్రీకి ఓ అతిథిలా వచ్చి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న వ్యాపారవేత్త సచిన్‌ సగ్గార్‌ను పెళ్లాడి లండన్‌లోనే సెటిల్‌ అయిపోయింది. ప్రస్తుతం అన్షు అక్కడ ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇన్‌స్పిరేషన్‌ కౌచర్‌ అనే డిజైనింగ్‌ షాప్‌ కూడా ఉంది. అక్కడ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు చేస్తోందట. ఇదిలా వుంటే గతంలో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మన్మథుడు సుందరి ఆ రూమర్లను కొట్టిపారేస్తూ తను లండన్‌లో సంతోషంగా జీవిస్తున్నానని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అన్షు ఇండస్ట్రీని వదిలేసి సుమారు 18 ఏళ్లవుతోంది.  ఈ మధ్యే ఆమె తిరిగి సినిమాల్లోకి రానుందంటూ కథనాలు వచ్చాయి. కానీ ఇంతరవకు వాటిపై స్పష్టత రాలేదు. ఆమె తిరిగి వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. అయినప్పటికీ ఏదో అద్భుతం జరిగి ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు.

చదవండి: నటి టాప్‌లెస్‌ ఫొటో, నెటిజన్‌పై సెటైర్‌

‘ప్రేమ దేశం’ హీరో వినీత్‌ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యాడంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు