Manoj Bajpayee: నేను పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు

6 Aug, 2021 20:39 IST|Sakshi

Manoj Bajpayee: మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఈ పేరు చెప్పగానే అందరికీ ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీసే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలిచిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఇందులో ఓ వైపు మధ్యతరగతి భర్తగా, మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు మనోజ్‌. సుమారు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోన్న ఈ నటుడు తనేమీ పూలబాటలో నడుచుకుంటూ రాలేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా జర్నీ గురించి చెప్పడానికి చాలా ఉంది. అది ఒక్క ఇంటర్వ్యూలో అయిపోయేది కాదు. తప్పకుండా ఏదో ఒకరోజు నా ఆటోబయోగ్రఫీ రాస్తాను. అప్పుడు మీరు నా గురించి పూర్తిగా తెలుసుకుంటారు.

జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చూశాను. నా ప్రయాణం ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ వంటిది. ఈ 25 ఏళ్లలో మంచి సినిమాల కోసం, మంచి పాత్రల కోసం ఎంతగానో కష్టపడ్డాను, పోరాడాను. నేను నడిచిన దారి గుండా మరొకరు రావాలని నేను కోరుకోను. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంది. ఎన్నో కలలతో, ఆత్మ గౌరవంతో ఇక్కడకు రావాలని ప్రయత్నించేవారిని తొక్కేసేందుకు కొత్త శత్రువులు తయారవుతుంటారు. వాళ్లు మనద్వారా వారి కలలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. కానీ నేను ఎదుటివారి కలలను నిజం చేయడానికి రాలేదు. నా కాళ్ల మీద నేను, సొంతంగా బతకడానికి వచ్చాను. అలా ఎన్నో సంఘర్షణల మధ్య 25 ఏళ్లు ఈ ఇండస్ట్రీలో ఉండగలిగాను' అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు