తెలుగు తెరకు ప్రపంచ సుందరి

4 Mar, 2023 08:53 IST|Sakshi

మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. 2017లో ‘ప్రపంచ సుందరి’కిరీటం దక్కించుకున్న ఈ నార్త్‌ బ్యూటీ హిందీలో ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రంలో మానుషీని కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

తెలుగు,హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌, సినిమాటోగ్రాఫర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘యథార్థ ఘటనల ప్రేరణతో రూపొందిస్తున్న యాక్షన్‌ డ్రామా ఇది. ఇందులో వరుణ్‌ తేజ్‌ భారతీయ వైమానిక దళ పైలట్‌గా, రాడార్‌ ఆఫీసర్‌గా మానుషి చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తున్నాం. శుక్రవారం షూటింగ్‌ ఆరంభించాం’అని చిత్రబృందం పేర్కొంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినై సన్స్‌ పిక్చర్స్‌ సంస్థలపై సందీప్‌ ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత : నందకుమార్‌ అబ్బినేని

మరిన్ని వార్తలు