అమెజాన్‌ ప్రైమ్‌లో దూసుకుపోతున్న సూపర్‌ హిట్‌ తెలుగు సినిమా

15 Oct, 2023 11:04 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ 'మార్క్‌ ఆంటోని'. సెప్టెంబర్‌ 15న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. హీరో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్‌జే సూర్య జీవించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్‌)

అక్టోబరు 13వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియాలో టాప్‌ ట్రెండింగ్‍లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈమేరకు తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. ' నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి' అని విశాల్ తెలిపాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పరపెక్ట్‌గా సెట్‌ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు ఉంటే అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ ఆదివారం చూసి ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని వార్తలు