రెండో పెళ్లికి రెడీ అయిన హాలీవుడ్‌ స్టార్స్‌

9 Jun, 2021 15:30 IST|Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ జంట రెండో పెళ్లికి సిద్ధమైంది. గతేడాది నుంచి డేటింగ్‌లో ఉన్న గేయ రచయిత మార్క్‌ రోన్‌సన్‌, నటి గ్రేస్‌ గమ్మర్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్క్‌ మాట్లాడుతూ.. కాబోయే భార్యకు ఇచ్చిన మొదటి ముద్దు తన మనసులో శిలాఫలకంలా ముద్రించుకుపోయిందని చెప్పుకొచ్చాడు.

కాగా హాలీవుడ్‌ ప్రముఖ నటుడు మెరిల్‌ స్ట్రీప్‌ కూతురే గ్రేస్‌ గమ్మర్‌. ఆ మధ్య గ్రేస్‌ ఎడమ చేతి వేలికి వజ్రపు ఉంగరం కనిపించడంతో సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. కానీ గత ఆదివారమే తమ నిశ్చితార్థం జరిగిందని మార్క్‌ వెల్లడించడంతో ఆ వార్తల్లో నిజం లేదని నిర్ధారణ అయింది. మార్క్‌, గ్రేస్‌ గతేడాది నుంచే ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని డిన్నర్‌లకు, విహార యాత్రలకు తిరుగుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కాగా వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లి. గ్రేస్‌ గతంలో టే స్ట్రతైర్న్‌ను పెళ్లాడింది. కానీ కొన్ని నెలలు కూడా తిరగకముందే విడాకులు ఇచ్చి అతడితో బంధాన్ని తెంచుకుంది. అటు గ్రామీ అవార్డు విజేత మార్క్‌ కూడా గతంలో ఫ్రెంచ్‌ నటి జోసెఫిన్‌ డె లా బ్యూమ్‌ను పెళ్లాడాడు. 2011లో పెళ్లి ద్వారా ఒక్కటైన ఈ జంట 2018లో విడిపోయింది.

చదవండి: వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్‌ అవార్డ్స్‌

ప్రియాంకకు ఈ విషయం చెప్పడానికి కెవిన్‌కే ఫోన్‌ ఇచ్చా: నిక్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు