జానీ వల్లే ఇదంతా.. ఆయనకు ధన్యవాదాలు: ‘మరో ప్రస్థానం’ హీరోయిన్

13 Sep, 2021 15:39 IST|Sakshi

పైసా వసూల్, రాగల 24 గంటల్లో చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న కథానాయిక ముస్కాన్ సేథి. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. ఇందులో తనీష్‌కి జోడిగా చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా జానీ ఈ మూవీని తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. కాగా ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సినిమా సందర్భంగా ముస్కాన్ సేథి మాట్లాడుతూ ‘మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్. ఇదో ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో యాక్షన్‌ సీన్స్‌లో నటించాను. ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే డెరెక్టర్‌ జానీ ప్రతి సీన్‌ గురించి డీటైల్‌గా చెప్పడంతో చేయగలిగాను. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని చెప్పింది. అంతేకాకుండా ‘ఇది రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. కథంతా ఒకే రోజులో జరుగుతుంది. ఫైట్ మాస్టర్ శివ నేతృత్యంలో తీసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ‘మరో ప్రస్థానం’ ప్రేక్షకులకి తప్పకుండా న​చ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని ముస్కాన్‌ తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు