మార్టిన్ వస్తున్నాడు

25 Feb, 2023 01:09 IST|Sakshi

‘‘దేశవ్యాప్తంగా కన్నడ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం  సంతోషంగా ఉంది. సుదీప్, యశ్‌గార్లు నా సీనియర్‌ యాక్టర్స్‌. వారు ఆల్రెడీ పాన్‌ ఇండియా సినిమాలు చేశారు. వారితో నేను పోటీపడటం లేదు. ఓ యాక్టర్‌గా ఇంకా మెరుగయ్యేందుకు నాతోనే నేనుపోటీ  పడుతుంటాను’’ అని అన్నారు హీరో ధృవ సర్జా. ‘అద్దూరి’ (2012) చిత్రం తర్వాత హీరో ధృవ సర్జా, దర్శకుడు ఏపీ అర్జున్‌ కాంబోలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘మార్టిన్’.

ఈ చిత్రంలో వైభవి శాండల్య, అన్వేషి జైన్‌ హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కథ అందించిన ఈ సినిమాను ఉదయ్‌ కె. మెహతా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘మార్టిన్’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ధృవ సర్జా మాట్లాడుతూ– ‘‘మార్టిన్‌’ చిత్రం దేశభక్తి నేపథ్యంలో ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను.

ఇంటర్‌నేషనల్‌ ఫైటర్స్‌తో కూడిన యాక్షన్‌ సన్నివేశాల కోసం బాగా బరువు పెరిగాను’’ అన్నారు. ‘‘రాజమౌళి, ప్రశాంత్‌ నీల్, మణిరత్నం వంటి దర్శకులు భాషా పరమైన హద్దులను చెరిపేశారు. ఇప్పుడు అంతా ఇండియన్‌ సినిమాయే’’ అన్నారు అర్జున్‌.  ‘‘ధృవతో నేను గతంలో ప్రేమకథ చేశాను. ఇప్పుడు  యాక్షన్‌ మూవీగా ‘మార్టిన్’ చేశాను’’ అన్నారు అర్జున్‌ ఏపీ. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు