30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్‌

12 Jun, 2021 13:46 IST|Sakshi

'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ సంతోష్ కెరీర్‌ను మార్చేసింది. ఇప్పటికే పలు అవకాశాలు ఈయన్ని వరిస్తున్నాయి. తాజాగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఫైనలైజ్‌ అయ్యిందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సంతోష్‌కు జోడీగా మెహ్రీన్‌ కనిపించనుందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎఫ్‌3 తప్పా పెద్దగా అవకాశాలు లేదు. దీంతో ఈ కుర్ర హీరోతో జత కట్టేందుకు రెడీ అయ్యిందట ఈ భామ. అంతేకాకుండా పెళ్లి కూడా వాయిదా పడటంతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట. 

కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యేలా డైరెక్టర్‌ మారుతి ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించినట్లు సమాచారం. లవ్‌ అండ్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు  ‘మంచిరోజులు వచ్చాయి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమా అనంతరం డైరెక్టర్‌ నందినీ రెడ్డితోనూ సంతోష్‌ శోభన్ ఓ ప్రాజెక్టుకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. చూస్తుంటే సంతోష్‌ శోభన్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారినట్లు కనిపిస్తుంది. 

చదవండి : ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు