వరుస ఫ్లాప్స్‌.. ప్రభాస్‌ ‘రాజా డీలక్స్‌’ అనుమానాలు!

15 Jul, 2022 15:32 IST|Sakshi

పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ లో మారుతి నెక్ట్స్ తాను చేయబోతున్న సినిమాల లిస్ట్ ప్రకటించాడు.అందులో ఒకటి ప్రభాస్ తో ఉంటుందని తెలిపాడు.ప్రభాస్ ఫ్యాన్ గా వింటేజ్ యంగ్ రెబల్ స్టార్ ను తెరపై చూపిస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చాడు. పక్కా కమర్షియల్ రిలీజైన 20 రోజులకు ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతానన్నాడు.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డౌట్స్ రైజ్ అయ్యాయి.

గతేడాది మారుతి తెరకెక్కించిన ‘మంచి రోజులు వచ్చాయి’బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.ఇక ఇటీవల గోపిచంద్‌తో తీసిన ‘పక్కా కమర్షియల్‌’చిత్రం కూడా కాసుల వర్షం కురిపించలేకపోయింది. దీంతో మారుతికి ప్రభాస్‌ సినిమా మిస్‌ అయిందనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో సినిమా తీయడం అంత ఈజీకాదు. ఆయనకున్న స్టార్‌డమ్‌ని దృష్టిపెట్టుకొని పకడ్బంధీగా కథను తీర్చిదిద్దాలి. దాన్ని యంగ్‌ డైరెక్టర్‌ మారుతి హ్యాండిల్‌ చేయగలడా అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలు నుంచి వ్యక్తమవుతున్నాయి.

గతంలో ప్రభాస్‌ ఇలాంటి యంగ్‌​ డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చి వరుస అపజయాలను మూటగట్టుకున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్‌తో తీసిన సాహో, రాధాకృష్ణ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు బక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. ఈ దశలో  మారుతికి కొత్త సినిమాను చేసే ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే స్టోరీతో కనుక ఇంప్రెస్ చేస్తే, మారుతితో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇస్తే కనుకగా రాజా డీలక్స్ ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్‌ లో పట్టాలెక్కడం ఖాయం.

మరిన్ని వార్తలు