మళ్లీ మర్యాద రామన్న జోడీ

28 Nov, 2020 05:50 IST|Sakshi

హీరోగా సునీల్‌ కెరీర్‌లో మంచి విజయం అందించిన చిత్రం ‘మర్యాద రామన్న’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సునీల్, సలోని జంటగా నటించారు. ఈ సినిమా 2010లో విడుదలైంది. పదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ స్క్రీన్‌ మీద జంటగా కనిపించబోతోందట. సునీల్, సలోని హీరోహీరోయిన్లుగా   దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా