ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్‌.. హీరోయిన్‌ స్ట్రాంగ్ రిప్లై

13 Jul, 2022 18:34 IST|Sakshi

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్‌ మసాబా గుప్తా ట్రోలింగ్‌ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్‌ 'నువ్‌ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్‌. ఈ ఫ్యాషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా) రంగంలో నువ్‌ ఎలా ఉన్నావ్‌' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. 

ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్‌ వర్క్‌, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్‌. (నా మైండ్‌, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్‌ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది మసాబా గుప్తా. 

చదవండి:  'అవును, ఆ రూమర్‌ నిజమే' అంటున్న రష్మిక.. ‍అతడితో..
ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్‌ పారితోషికంపై చర్చ !

మసాబా గుప్తా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్‌ 'మోడ్రన్‌ లవ్‌ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్‌ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్‌ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్‌ వివేక్‌ మెహ్రాను వివాహం చేసుకుంది. 

చదవండి: నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు