Eagle Movie Box Office Collections: రవితేజ ఈగల్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?

11 Feb, 2024 19:18 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం  అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు  తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్‌ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 

అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్‌ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి.

ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ చేరుకునేలా కనిపిస్తోంది.  రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా..  ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని  హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega