కిరణ్‌ అబ్బవరం మాస్‌ సాంగ్‌ ‘చమక్‌ చమక్‌ పోరి..’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

13 Mar, 2023 16:42 IST|Sakshi

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘మీటర్‌’. నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసింది మూవీ యూనిట్‌.

ఇందులో భాగంగా ఈ చిత్రంలోని ‘చమక్‌ చమక్‌ పోరి..’అంటూ సాగే మాస్‌ లిరికల్‌ని తొలి పాటగాఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ‘‘పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. ‘చమక్‌ చమక్‌  పోరి..’ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్‌ డాన్స్ను చూస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు