విజయ్‌ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ 

19 Jun, 2021 08:41 IST|Sakshi

చెన్నై: కోలీవుడ్‌లో నటుడు విజయ్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈయన చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక విజయ్‌ పుట్టినరోజంటే అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. ఈ నెల 22వ తేదీ విజయ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని నెల రోజుల నుంచే అభిమానులు కరోనా బాధిత కుటుంబాలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కాగా  విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా మాస్టర్‌ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ ఒక స్పెషల్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఆ పోస్టర్‌లో విజయ్‌ నటించిన (మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు) 64 చిత్రాలకు సంబంధించిన విజయ్‌ ముఖ చిత్రాలను పొందుపరిచారు. ప్రస్తుతం విజయ్‌ 65వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడిగా తెలుగులో తొలిసారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు.


 

మరిన్ని వార్తలు