Masterpeace Web Series: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్‌ సిరీస్‌ డేట్‌ వచ్చేసింది.. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా!

30 Sep, 2023 15:18 IST|Sakshi

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన నిత్యామీనన్‌ ప్రస్తుత దృష్టంతా ఓటీటీల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రీత్‌ అనే థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన నిత్య అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఈ హీరోయిన్‌ ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ శ్రీమతి కుమారి. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌కు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఇంతలోనే తను ప్రధాన పాత్రలో నటించిన మరో వెబ్‌ సిరీస్‌ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది.

నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన మలయాళ వెబ్‌ సిరీస్‌ మాస్టర్‌పీస్‌. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయడంతోపాటు స్ట్రీమింగ్‌ డేట్‌ను సైతం ప్రకటించారు. మాస్టర్‌పీస్‌ హాట్‌స్టార్‌లో అక్టోబర్‌ 25 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో నిత్య.. రియా అనే పాత్ర పోషించింది. ఆద్యంతం కామెడీగా సాగిపోతున్న ట్రైలర్‌  చూస్తుంటే ఫన్‌ గ్యారెంటీ అని తెలుస్తోంది. అయితే నిత్యామీనన్‌కు డబ్బింగ్‌ చెప్పిన వాయిస్‌ తనకు పెద్దగా నప్పలేనట్లు కనిపిస్తోంది. ఎన్‌. శ్రీజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులోకి రానుంది.

చదవండి: నాకు లవ్‌ మ్యారేజ్‌ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా!

మరిన్ని వార్తలు