Runway 34: రన్‌వే 34గా మారిన మేడే.. విడుదల ఎప్పుడంటే ?

29 Nov, 2021 16:53 IST|Sakshi

Mayday Movie Name Change Into Runway 34: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అజయ్ దేవగన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ నటిస్తున్న 'మేడే' చిత్రానికి 'రన్‌వే 34'గా పేరు మార్చారు. ఈ విషయాన్ని సోమవారం నిర్మాతలు ప‍్రకటించారు. అయితే ఈ చిత్రానికి హీరో అజయ్ దేవగన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2008లో వచ్చిన 'యూ మే ఔర్‌ హమ్‌', 2016లో వచ్చిన 'శివాయ్‌' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా విడుదల తేదిని సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రకటించారు. 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

అజయ్‌ దేవగన్‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ 'మేడే ఇప్పుడు రన్‌వే 34గా మారింది. నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించిన చిత్రం. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ థ్రిల్లర్‌ మూవీ ఏప్రిల్‌ 29, 2022న ఈద్‌కు ల్యాండ్‌ కానుంది.' అని రాసుకొచ్చారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మూడు ఆసక్తికరమైన పోస్టర్‌లను కూడా పంచుకున్నారు మేకర్స్‌. అందులో అజయ్‌ దేవగన్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఫస్ట్‌ లుక్‌లను విడుదల చేశారు. 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

గత డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2022న వెండితెరపైకి రానుంది. ఇందులో బొమన్‌ ఇరానీ, అంగీరా ధర్‌, ఆకాంక్ష సింగ్‌, యూట్యూబ్‌ సంచలనం క్యారీ మినాటి కూడా నటించారు. 2015లో ఇండియాలో చోటుచేసుకున‍్న పలు సంఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అజయ్‌ బ్యానర్‌, అజయ్‌ దేవగన్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌ నిర్మించగా, సినిమాటోగ్రఫీ అసీమ్‌, సందీప్‌ కెవ్లానీ స్క్రిప్ట్‌ అందించారు. 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

మరిన్ని వార్తలు