ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్‌ సినిమా.. ఆ సాంగ్‌ స్పెషల్‌

22 Feb, 2024 14:52 IST|Sakshi

మహేశ్‌ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయమై నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న అవంతిక వందనపు హాలీవుడ్‌లో సత్తా చాటుతుంది. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య  టాలీవుడ్‌ ప్రేక్షలు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ బాగుంటే అన్ని సినిమాలను చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవంతిక నటించిన చిత్రం తాజాగా ఓటీటీలోకి రావడంతో అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు క్రేజీగా చూస్తున్నారు.

హాలీవుడ్‌లో 'మీన్‌ గర్ల్స్‌- ది మ్యూజికల్' అనే సినిమాలో అవంతిక కీలకపాత్ర పోషించింది.  జనవరి 12న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటన పట్ల హాలీవుడ్‌ ప్రేక్షకులు ప్రశంసించారు. టీన్‌ కామెడీ చిత్రంగా వచ్చిన ఇందులో  హాలీవుడ్‌ ప్రముఖ నటులతో కలిసి అవంతిక నటించింది. ఈ చిత్రంలోని బోల్డ్‌ సాంగ్‌ ఒకటి ఇప్పటికీ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది. 'మీన్‌ గర్ల్స్‌-ది మ్యూజికల్' అనే సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే హాలీవుడ్‌లో ట్రెండింగ్‌ అవుంతుంది. కానీ ఈ సినిమాను ప్రస్తుతం ఇండియన్‌ ప్రేక్షకులు చూడలేరు.  ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఇండియన్‌ ప్రేక్షకులకు కూడా యాక్సెస్‌ రావచ్చని సమాచారం.

 'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేశ్‌ బాబుకు చెల్లెలుగా నటించిన అవంతిక పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. కానీ ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ ఆమె కనిపించలేదు.  ప్రస్తుతం ఆమె నటించిన మరో రెండు హాలీవుడ్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మూడు హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ల్లోనూ అవంతిక నటిస్తోంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు