మీరా సూసైడ్‌.. కంటతడి పెట్టిస్తున్న విజయ్‌ ఆంటోని భార్య మాటలు..

21 Sep, 2023 14:29 IST|Sakshi

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధను జీర్ణించుకోవడం ఎవరితరమూ కాదు.  కళ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగే కూతురు ఇక కనిపించదన్న వాస్తవాన్ని క్షణమైనా భరించలేరు పేరెంట్స్‌. అయినా సరే, భగవంతుడు కొందరికి అటువంటి శిక్షలే వేస్తాడు. భరించలేని బాధను ఇస్తాడు. హీరో విజయ్‌ ఆంటోని సైతం ప్రస్తుతం అదే బాధతో కుమిలిపోతున్నాడు.

మిస్‌ యూ ఆల్‌
ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కదా! సెప్టెంబర్‌ 19న తెల్లవారుజామున ఉరి వేసుకుని మరణించింది.  అయితే ఆమె గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు తెలుస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెన్నై పోలీసులు ఆమె రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మీరా.. తన స్నేహితులను, టీచర్స్‌ను మిస్‌ అవుతానని రాసుకొచ్చింది. తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని పేర్కొంది. చివర్లో.. లవ్‌ యూ ఆల్‌.. మిస్‌ యూ ఆల్‌ అని రాసింది . ఈ లెటర్‌ను ఆమె నోట్‌బుక్‌లో నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా?
ఇక విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది ఆమె తల్లి ఫాతిమా. 'నిన్ను నా గర్భంలో మోశానమ్మా.. నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా?' అని కంటికి ధారగా ఏడ్చేసింది. కూతురితో చివరిసారిగా ఫాతిమా మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చీకటి అంటే భయమున్న మీరా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? నిజంగానే డిప్రెషన్‌లో ఉందా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి!
 3 ఇడియట్స్‌ నటుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య

మరిన్ని వార్తలు