‌ఆరేళ్లుగా నటనకు దూరం.. రీ ఎంట్రీకి సిద్ధమైన హీరోయిన్

15 Apr, 2021 18:36 IST|Sakshi

తన క్యూట్‌ ఎక్సెప్రెషన్స్‌, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ మీరా జాస్మిన్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. దాదాపు ఆరేళ్లకు పైగా సినిమాలకు గుడ్‌బై చెప్పిన కేరళ భామ మీరా జాస్మిన్‌ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్‌ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్‌బుక్‌ పేజ్‌ ద్వారా ప్రకటించారు. తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో మీరా జాస్మిన్‌ నటించనున్నట్లు వెల్లడించారు.

అల వైకుంఠపురంలో ఫేం జయరాం, మీరా జాస్మిన్‌లు ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. జూలైలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మాధవన్‌ సరసన రన్‌ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌..ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వివాహం​ తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా వీరు విడాపోయారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా నటనకు దూరమైన మీరా జాస్మాన్‌..మరోసారి వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది. 

చదవండి : ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో
ఫ్లైట్‌లో తమన్నా: అక్కడ కోహ్లి ఏం చేస్తున్నాడు?


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు