మీట్‌ ‘క్యూట్’గా మెగాఫోన్‌ పట్టిన నాని సోదరి

14 Jun, 2021 23:09 IST|Sakshi

న్యాచురల్‌ స్టార్ నాని సోదరి క్యూట్‌గా మెగాఫోన్‌ పట్టేసింది. రోల్‌.. కెమెరా..యాక‌్షన్‌ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. నాని నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై ‘మీట్‌ క్యూట్‌’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను దీప్తి తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు దర్శకత్వ బాట పట్టారు. ఈ విషయాన్ని నాని ట్విటర్‌లో తెలిపారు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం’ అంటూ ‘మీట్‌ క్యూట్‌’కు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. 

అందులో సత్యరాజ్‌ కూర్చుని ఉండగా నాని క్లాప్‌ కొడుతున్న ఫొటోతో పాటు మరో ఫొటో పంచుకున్నారు. సత్యరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫొటో చూస్తుంటే సత్యరాజ్‌కు దీప్తి సీన్‌ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. నాని నిర్మాణంలో ‘అ!, హిట్‌’ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమా ఆ బ్యానర్‌లో నాలుగోది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు