బిగ్‌బీ మనవరాలితో ప్రేమాయణం: క్లారిటీ ఇచ్చిన నటుడు!

1 Jul, 2021 12:09 IST|Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా, బాలీవుడ్‌ యువ నటుడు మీజాన్‌ జాఫేరీ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ మధ్య మీజాన్‌ తండ్రి జావేద్‌ స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. అయినా మీడియా మాత్రం వారిని ప్రేమపక్షులుగా అభివర్ణించింది. దీంతో తాజాగా మీజాన్‌.. నవ్యతో తనకున్న అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. "చాలాకాలంగా నవ్య నవేలీ గురించి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిజంగా, నిజాయితీగా చెప్తున్నా.. ఆమె, నేను మంచి స్నేహితులం మాత్రమే. కానీ నా గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె పేరు ప్రస్తావిస్తున్నారు. ఇది అన్యాయం. ఆమె వ్యక్తిగత జీవితం వేరు. నవ్య నాకు మాత్రమే కాదు, నా సోదరికి కూడా బెస్ట్‌ ఫ్రెండ్‌. అయినా ఇలాంటి సమయంలో వేరొకరి గురించి ఇలా ఇష్టమొచ్చినట్లుగా కథనాలు అల్లేయడం ఏమీ బాగోలేదు. దీనివల్ల నేను నా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నాను. గడప లోపలకు అడుగు పెట్టగానే మా పేరెంట్స్‌.. ఏంటిదంతా? అన్నట్లుగా ఓ లుక్కిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి జారుకుంటున్నాను. అయినా నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేను" అని మీజాన్‌ స్పష్టం చేశాడు.

చదవండి: యువ నటుడితో నవ్య నవేలీ ప్రేమ!: స్పందించిన నటుడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు