సింగర్‌ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్‌

13 Jan, 2021 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ గాయనీ సునీత ఇటీవల మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహమని తెలిసిందే. దీంతో ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్‌లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: సింగర్‌ సునీత పెళ్లి: కత్తి మహేష్‌ కామెంట్స్)

ఈ తరుణంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్‌ వేదికగా సునీత-రామ్‌లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు