13 ఏళ్ల గ్యాప్ తర్వాత అందులో నటించనున్న మెగాస్టార్‌

10 Feb, 2022 00:06 IST|Sakshi

ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇటు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌ చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. చిరంజీవికి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో థమ్స్ అప్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే చివరిగా 13 ఏళ్ల క్రితం మెగాస్టార్‌ క‌మ‌ర్షియ‌ల్‌ యాడ్‌లో కనిపించారు.

ఇక ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రే యాడ్‌లోనూ న‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం మేర‌కు చిరంజీవి ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీటైన విషయం తెలిసిందే. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు.

మరిన్ని వార్తలు