Megastar Chiranjeevi: మీ కెరీర్ మరింత అద్భుతంగా సాగాలి..మెగాస్టార్ ట్వీట్ వైరల్

28 Jan, 2023 16:48 IST|Sakshi

వాల్తేరు వీరయ్య హీరోయిన్‌కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  హీరోయిన్‌ శృతిహాసన్‌ పుట్టిన రోజు సందర్భంగా చిరు విష్ చేశారు. ఈ మేరకు తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే' పాటలోని ఫోటోను జత చేశారు. దీంతో మెగా అభిమానులు సైతం శృతిహాసన్‌కు విషెస్ చెబుతున్నారు.

మెగాస్టార్ ట్విటర్‌లోరాస్తూ..' ప్రియమైన శ్రుతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. వృత్తి పట్ల మీ అంకితభావం, మీకున్న బహుముఖ ప్రజ్ఞతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

మరిన్ని వార్తలు