Chitanjeevi 44 Years: నేటికి 44 ఏళ్లు, ‘చిరంజీవిగా.. నేను పుట్టిన రోజు ఇది’

22 Sep, 2022 20:19 IST|Sakshi

మెగాస్టార్‌.. అంటే ఓ బిరుదు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమలో ఇదొక బ్రాండ్‌. పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ మెగా హీరోగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. తొలుత ఓ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి విలన్‌గా కూడా మెప్పించారు. అనంతరం హీరోగా మారి బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్‌లను అందిస్తూ సుప్రీం హీరోగా ఎదిగారు. ‘స్వయం కృషి’ ఇండస్ట్రీలో  ఎదిగిన ఆయన తన నటన, డాన్స్‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్‌.. నటుడు ప్రభాకర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

ఇక చిరు ఇండస్ట్రీకి పరిచయమై నేటికి 44 ఏళ్లు. ఆయన సినీరంగ ప్రవేశం చేసిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు ట్వీట్‌ చేశారు. ఈ జన్మలో మీ రుణం తీర్చలేనిదంటూ అభిమానుల పట్ల ఆయన కృతజ్ఞత చూపించారు.  ఈ మేరకు చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు నేడు. ఈ రోజు 22 సెప్టెంబర్‌ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా నా ఊపిరై.. నా గుండె చప్పుడై అన్ని మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్‌ కౌంటర్‌

నన్నింతగా ఆదిరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. కాగా ప్రాణం ఖరీదు చిత్రంలో చిరు నర్సయ్య అనే ఓ సాధారణ వ్యక్తిగా కనిపించారు. ఇదిలా ఉంటే 6 పదుల వయసులో కూడా చిరు ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తు‍న్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు