Chalapathi Rao: చలపతిరావు వేసే వేషాలకు ..వ్యక్తిగత అలవాట్లకు సంబంధమే లేదు

25 Dec, 2022 13:54 IST|Sakshi

నటుడు చలపతిరావు మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలపతిరావు తనకు మంచి మిత్రుడని అన్నారు. చలపతి రావు భౌతిక కాయనికి నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘చలపతిరావుని కోల్పోవడం చాలా బాధాకరం. మద్రాస్‌లోమద్రాసులో ఉన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. ఎప్పుడూ అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి చలపతి రావు. అన్ని రకాల పాత్రలు పోషించిన గొప్ప నటుడు’అని కొనియాడాడు.

అతను వేసిన వేషాలు,జోకులు..వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకు ఏమాత్రం సంబంధం లేదు. చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్న మనిషి అతను. కాఫీ, టీలు కూడా తాగేవారు కాదు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకొనే ఆయన..ఇలా గుండెపోటుతో మరణించడం బాధాకరం. చలపతిరావు కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను’అని చిరంజీవి అన్నారు. 

మరిన్ని వార్తలు