Chiranjeevi-Konijeti Rosaiah: ఒక శకం ముగిసింది.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు

4 Dec, 2021 11:03 IST|Sakshi

Megastar Chiranjeevi Condolence On Konijeti Rosaiah Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ‍్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం (డిసెంబర్‌ 4) ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌లోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ప‍్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఒక యోగిలా సేవ చేశారన్నారు. 'రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర‍్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య' అని చిరంజీవి పేర్కొన్నారు. 


ఇదీ చదవండి: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా..

మరిన్ని వార్తలు