Taraka Ratna Death: ఇంతచిన్న వయసులోనే వెళ్లిపోయావా.. తారకరత్న మృతి పట్ల చిరంజీవి, రవితేజ సంతాపం..

19 Feb, 2023 07:57 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న(39) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. ప్రకాశవంతమైన, ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల యువకుడు చిన్నవయసులోనే మరణించాడని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

తారకరత్న కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

రవితేజ సంతాపం..
మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించారనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డానని రవితేజ ట్వీట్ చేశారు. ఇతరులపట్ల దయగల స్వభావం కలగిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈమేరకు రవితేజ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు