తెలుగు ప్రజలందరీ తరఫున ఆయనకు అభినందనలు: చిరంజీవి

14 Jan, 2023 15:54 IST|Sakshi

టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఆయన రచించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్‌ను చిరంజీవి, రవితేజ ఘనంగా సన్మానించారు. 

చిరంజీవి మాట్లాడుతూ.. 'చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంది. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణితోపాటు ఈ పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. తెలుగు వాళ్లందరి తరఫున చంద్రబోస్‌కు నా ప్రత్యేక అభినందనలు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు.' అంటూ కొనియాడారు. 

కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 


 

మరిన్ని వార్తలు