Shiva Shankar Master Death: ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్‌ భావోద్వేగం

28 Nov, 2021 21:28 IST|Sakshi

Megastar Chiranjeevi Emotional Sentences On Shiva Shankar Death: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సినీ లోకం తీవ్ర దిగ్భ‍్రాంతికి  లోనయ్యింది. శివశంకర్‌ మాస్టర్‌ మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం తెలిపారు. మాస్టర్ మరణం తనను కలచివేసిందని చిరింజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలు అందించారని మెగాస్టార్‌ కొనియాడారు. 

'శివశంకర్ మాస్టర్‌, నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

ఇది చదవండి: శివశంకర్‌ మాస్టర్‌కు చిన‍్నప్పుడు గాయం.. సుమారు ఎనిమిదేళ్లు..

మరిన్ని వార్తలు