సిరివెన్నెలను తలచుకుని కంట తడి పెట్టుకున్న చిరంజీవి

30 Nov, 2021 19:34 IST|Sakshi

Megastar Chiranjeevi Emotional Words About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగస్టార్‌ చిరంజీవి కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ముృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. 
(చదవండి: ఇప్పుడు నా కుడి భుజం పోయింది: కే. విశ్వనాథ్‌)

అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం..  కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు.

చదవండి: ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు