Megastar Chiranjeevi: చిరు వాయిస్‌తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’

26 Oct, 2021 15:04 IST|Sakshi

ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠిలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీకి ‘గాడ్‌ఫాదర్‌’ మెగాస్టార్‌ చిరంజీవి గొంతు ఇచ్చినట్లు తాజాగా డైరెక్టర్‌ కృష్ణవంశీ వెల్లడించారు. 

చదవండి: 'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి

ఈ మేరకు ఆయన ట్విట్‌ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు ఆయన 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్తో పాటు రమ్యకృష్ణ కీ రోల్‌ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్‌, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

మరిన్ని వార్తలు