స్టోరీ టెల్లింగ్‌ బాగుంది

19 Mar, 2021 06:21 IST|Sakshi

– చిరంజీవి

‘‘ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు.. దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి...’ అంటూ ‘విరాటపర్వం’ టీజర్‌ విడుదలైంది. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్‌  ఈజ్‌ ఏన్‌  యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌ . డి. సురేష్‌ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసి, ‘స్టోరీ టెల్లింగ్‌ అద్భుతంగా ఉంది.. చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ గ్లింప్స్, సంక్రాంతికి విడుదల చేసిన రానా–సాయిపల్లవి జంట పోస్టర్‌కి కూడా సూపర్బ్‌ రెస్పా¯Œ ్స వచ్చింది. యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు