Waltair Veerayya Mass Song: మెగాస్టార్ వర్సెస్ మాస్ మహారాజా.. సాంగ్‌ రిలీజ్‌ ఎప్పుడంటే.!

29 Dec, 2022 14:39 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్‌ కాంబినేషన్‌ సాంగ్ ఈనెల 30న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. 

తాజాగా మరో సాంగ్‌తో రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం రెడీ అయింది. వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్‌ సాంగ్‌ అలరించేందుకు వస్తోందంటూ చిరంజీవి, రవితేజ ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ట్వీట్‌ చేశారు మేకర్స్. మెగాస్టార్‌ వర్సెస్‌ మాస్ మహారాజా అంటూ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు