Megastar Chiranjeevi: అవార్డుపై స్పందించిన మెగాస్టార్.. ఎమోషనల్ ట్వీట్

20 Nov, 2022 21:28 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించటం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ గౌరవం నాకు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2022 ఏడాది గానూ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

నాకు ఈ అవార్డు రావడానికి ప్రధానం కారణం నా అభిమానులేనని చిరు అన్నారు. నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరి వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌-2022 అవార్డు అందుకోనున్నారు. 

మరిన్ని వార్తలు