Megastar Chiranjeevi Tweet: చిరంజీవికి సెప్టెంబర్‌ 22 చాలా ప్రత్యేకం.. ఎందుకంటే..

22 Sep, 2021 14:59 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థానం, స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళామ్మతల్లి ఒడిలో 40 ఏళ్లకు పైగా నటుడిగా కొనసాగుతూ ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించారు. అయితే చిరుకు మాత్రం సెప్టంబర్‌ 22 చాలా ప్రత్యేకమంటున్నారు. తాజాగా దానికి సంబంధించి ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చిత్ర సీమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వయంకృషి, కష్టపడే తత్వం.. లాంటివి పునాది రాళ్లుగా మార్చుకుని టాలీవుడ్‌లో కొణిదల శివశంకర్‌ వరప్రసాద్‌ నుంచి అభిమానుల మెగాస్టార్ చిరంజీవిగా అవతారం ఎత్తారు.ఆయన వెండితెర బాస్. చిరు తన జీవితంలో రెండు తేదీలను ఎప్పటికీ మరిచిపోలేరు. ఒకటి ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీ. రెండోది సెప్టెంబరు 22వ తేదీ.

ఎందుకుంటే చిరు తొలి చిత్రం "ప్రాణం ఖ‌రీదు" విడుద‌లైంది ఆ రోజే కాబట్టి. సరిగ్గా నేటితో ఈ చిత్రం విడుదలై 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను మెగాస్టార్ గుర్తుచేసుకుంటూ ఓ పోస్టును షేర్‌ చేశారు. ఆ టీట్‌లో.. ఆగస్ట్ 22న నా పుట్టిన రోజైతే, సెప్టెంబర్ 22న నేను నటుడిగా పుట్టినరోజు. కళామ్మ తల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.

మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు. నేను మెగాస్టార్‌లా ఈ రోజు మీ ముందు ఇలా ఉండడానికి ఎంతో మంది సోదర సోదరీమణులే కారణమంటూ చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.  కెరీర్‌ పరంగా 150కి పైగా చిత్రాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్‌తో నటిస్తున్నాడు. సెప్టంబర్‌ 22 చిరుకి ప్రత్యేకమైనది కావడంతో ఆయన తమ్ముడు నాగబాబు నెట్టింట.. ఈ రోజు ఓ స్టార్‌ పుట్టాడని ట్వీట్‌ చేస్తూ చిరుపై తనకున్న ప్రేమను ఈ రకంగా చూపించారు.

చదవండి: ఇదేం స్టైల్‌ బై..! ‘గబ్బర్‌సింగ్‌’ బ్యూటీని ట్రోల్‌ చేసిన నెటిజన్లు

మరిన్ని వార్తలు