Megastar Tweet Viral: 'కింగ్‌నైనా.. కింగ్‌ మేకర్‌నైనా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ'.. చిరు ట్వీట్

4 Oct, 2022 18:18 IST|Sakshi

దసరా కానుకగా చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ చిత్రబృందం ఓ ప్రెస్‌మీట్‌లో సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్‌పై చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. 'కింగ్ అయినా.. కింగ్ మేకర్‌ అయినా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ' అంటూ వాయిస్‌తో పోస్ట్ చేశారు మెగాస్టార్. సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. చిరు వాయిస్‌తో డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  గాడ్ ఫాదర్ అలరించనుంది. 

మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించగా.. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. 

మరిన్ని వార్తలు