Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

7 Feb, 2023 14:34 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 

అసలు కథేంటంటే..
వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్‌ ఫ్యాక్టరీ రన్‌ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్‌).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్‌ డీలర్‌ సాల్మన్‌ సీజర్‌( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్‌ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్‌ సీజర్‌ అలియాస్‌ కాలా(ప్రకాశ్‌ రాజ్‌)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్‌ సీజర్‌కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్‌) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్‌ సాగర్‌(రవితేజ) గతమేంటి? డ్రగ్స్‌ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు