రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌

8 Jun, 2023 13:21 IST|Sakshi

నితిన్‌ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్‌కు: షాహిద్ కపూర్)

తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్  స్పందించలేదు.
(ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఇదే!)

మరిన్ని వార్తలు