చిరంజీవి సర్జా వర్థంతి: జూ. చిరుతో కలిసి కుటుంబ సభ్యుల పూజలు

8 Jun, 2021 09:07 IST|Sakshi

యశవంతపుర: శాండల్‌వుడ్‌ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూసి సోమవారానికి ఏడాది అయ్యింది. 2020 జూన్‌ 7న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కనకపుర రోడ్డులోని కగ్గిలిపుర నలగుళి వద్ద ధ్రువసర్జా ఫాంహౌస్‌లో సర్జా సమాధికి భార్య మేఘనారాజ్, చిన్నారి కొడుకు జూనియర్‌ చిరు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. ప్రముఖ నటుడు, మేనమామ అర్జున్‌ సర్జా చిరుతో తీసుకున్న చిన్ననాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి సర్మించుకున్నారు. జీవితంలో పూర్తి మిస్‌ అయ్యామని, మీరు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలని కోరుకున్నారు.

చదవండి: 
చిరంజీవి సర్జా తొలి వర్థంతి, మేఘన ఎమోషనల్‌

మరిన్ని వార్తలు