Meghana Raj: తనయుడి పేరు రివీల్‌ చేసిన మేఘనా రాజ్‌

3 Sep, 2021 19:04 IST|Sakshi

Meghana Raj Son Name Revealed: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్‌ తన కొడుకు పేరును రివీల్‌ చేసింది. తన బాబుకు రాయన్‌ రాజ్‌ సర్జా అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో బ్యూటిఫుల్‌ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో భర్తతో కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను యాడ్‌ చేయడంతో పాటు కొడుకు ఆడుకుంటున్నట్లుగా చూపించింది. అనంతరం జూనియర్‌ చిరు పేరును రాయన్‌ అని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది,

కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా.. చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే మేఘనను ఒంటరిని చేస్తూ చిరు సర్జా గతేడాది జూన్‌ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్‌ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

A post shared by Meghana Raj Sarja (@megsraj)

మరిన్ని వార్తలు