అరుదైన ఫోటోను షేర్‌ చేసిన మేఘనా రాజ్‌

2 Jun, 2021 11:05 IST|Sakshi

సాక్షి, బెంగళూరు :  కన్నడ నటి మేఘనా రాజ్‌ తన కొడుకు చిరు(సింబా) అరుదైన ఫోటోలను షేర్‌ చేసింది. గత కొన్ని రోజులు క్రితం మేఘనా తన చిన్నారి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో జూనియర్‌ చిరు ఎల్లో టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. అయితే చిరంజీవి సర్జా అభిమానులు ఈ ఫోటోను, చిరంజీవి, మేఘనాలతో కొలైడ్‌ చేసి అపురూపంగా తీర్చిదిద్దారు. ఇందులో ముగ్గురూ పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. ఈ ఫోటోను మేఘనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పింది. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూన్‌ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు.  

ఆ సమయంలో 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్‌ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి చిరునవ్వులో, కళ్లలో, కదలికలో.. ఇలా అన్నింటిలోనూ తన భర్తను చూసుకుంటున్నానని పేర్కొంది. 36 ఏళ్ల వయసులో చిరంజివి సర్జా గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్‌ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. 

చదవండి : జూనియర్‌ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా
భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా!

మరిన్ని వార్తలు