పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్‌

27 May, 2021 09:27 IST|Sakshi

కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు యువతరాన్ని కట్టిపడేసింది పంజాబీ హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌. ఎఫ్‌ 2, మహానుభావుడు, కవచం వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయింది. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది సెకండాఫ్‌లో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్‌ కోవిడ్‌, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది. 

"కరోనా వైరస్‌ మరికొంతకాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వెంటనే మేము ముంబైలో క్వారంటైన్‌లో ఉండిపోయాం. చాలా భయపడిపోయాం. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచే ఎలాగోలా బయటపడ్డాం"

"కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్‌ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్‌ వచ్చింది. అప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే చర్చించడం లేదు. అయినా పరిస్థితులు చక్కబడాలి కదా!" అని మెహ్రీన్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్‌3’లో నటిస్తోంది.

చదవండి: ‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్‌’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు