Mehreen Pirzada: సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మెహరీన్‌ స్పార్క్‌ మూవీ

11 May, 2022 08:18 IST|Sakshi

విక్రాంత్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్‌’. మెహరీన్‌ హీరోయిన్‌. సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కుమార్‌ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్‌ రెడ్డి, దర్శకుడు సురేందర్‌ రెడ్డి, కెమెరామేన్‌ రత్నవేలు, నిర్మాత అన్వేష్‌ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు అరవింద్‌. దర్శకులు శంకర్, సుకుమార్‌గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు