Actress Mehreen Dance Video: నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ చిందులు.. వీడియో వైరల్‌

25 Jun, 2022 13:14 IST|Sakshi

ఓ పక్క సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్‌ చేస్తూ కొత్త ఫాలోవర్స్‌, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్‌ హీరోయిన్‌ తను పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌ అంటే.. 'ఎఫ్‌3'తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్‌ మెహ్రీన్‌ పిర్జాదా.

ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్‌ మెహ్రీన్. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్‌ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్‌. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌' అనే క్యాప్షన్స్‌ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ.  

చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్‌ ఏంటంటే ?
ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మరిన్ని వార్తలు