‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్‌’

10 Mar, 2021 05:50 IST|Sakshi

‘‘చూడచక్కగా ఉన్నారు. మీ జంట సూపర్‌’’ అంటూ మెహరీన్‌ స్నేహితులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్‌ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తాజాగా మెహరీన్‌ స్కూల్‌ ఫ్రెండ్‌ తమన్నా నిశ్చితార్థంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఫొటో చూసినవాళ్లు సూపర్‌ అంటున్నారు.

ఈ శుక్రవారం (మార్చి 12) జైపూర్‌లోని అలీలా కోటలో మెహరీన్‌–భవ్య నిశ్చితార్థం జరగనుంది. భవ్యా బిష్ణోయ్‌ హరియానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్‌ బిష్ణోయ్‌ మనవడు, ఆదంపూర్‌ ఎమ్మెల్యే కుల్దీప్‌ బిష్ణోయ్‌ కుమారుడు. భవ్య కూడా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు. మెహరీన్‌–భవ్యాల వివాహ తేదీని నిశ్చితార్థం రోజున ప్రకటిస్తారట. ప్రస్తుతం మెహరీన్‌ ‘ఎఫ్‌3’లో నటిస్తున్నారు.

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మరిన్ని వార్తలు