పెళ్లి వాయిదా అనంతరం క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన మెహ్రీన్‌!

21 Jun, 2021 15:16 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2లో హనీ పాపగా అలరించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయ్యింది. గత నెలలలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులన్ని చక్కబడగానే అందరి సమక్షంలో ఘనంగా వీరి వివాహ వేడుకను జరుపుకావాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనంతరం మెహ్రీన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకుంది.  

ఇక ఆమెపెళ్లి వాయిదా పడటంతో దర్శక-నిర్మాతలు ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లికి ఇంకా సమయంలో ఉండటంతో తమ సినిమా షూటింగ్స్‌ భాగం చేసేలా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అంతేగాక మెహ్రీన్‌ కూడా పెళ్లికి ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఓ భారీ యాక్షన్‌ మూవీ ​కోసం మేకర్స్‌ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మాస్‌ పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో  హీరోయిన్‌గా శృతి హాసన్, త్రిష నటిస్తున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మెహ్రీన్‌కు ఆ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చేప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్రకు రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మెహ్రీన్‌ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే ఆమె ‘ఎఫ్‌ 3’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి వాయిదా పడిన వెంటనే మారుతి-సంతోష్ శోభన్ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు