కథ కొత్తగా ఉంటే ఆదరిస్తారు

2 Aug, 2020 05:27 IST|Sakshi
త్రినాద్‌ వెలిశిల

‘‘నాది విజయవాడ. బీటెక్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చాను. అసిస్టెంట్‌ రైటర్‌గా, ఘోస్ట్‌ రైటర్‌గా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశా. కొన్ని యాడ్‌ ఫిల్మ్స్, 5 షార్ట్స్‌ ఫిల్మ్స్‌ చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ చిత్రానికి దర్శకత్వం వహించాను... ఇదే నా తొలి సినిమా’’ అని డైరెక్టర్‌ త్రినా«ద్‌ వెలిశిల అన్నారు. అభినయ్‌ రెడ్డి, సమయ జంటగా నరేష్‌ బైరెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మేకసూరి’. కార్తీక్‌ కంచెర్ల నిర్మించిన ఈ చిత్రం జీ 5లో శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా త్రినా«ద్‌ వెలిశిల మాట్లాడుతూ –‘‘మోసగాళ్లకు మోసగాడు, ఒక్కక్షణం’ చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశాను.

ఆ తర్వాత ‘మేకసూరి’ కథను రెడీ చేసుకున్నా. ఈ చిత్రానికి నేను, కెమెరామెన్‌ పార్ధు సైనా కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యాం. విడుదల తర్వాత చాలా మంచి స్పందన వస్తోంది. నార్త్‌ వారు కూడా సబ్‌ టైటిల్స్‌తో చూస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటే ఎక్కడైనా ఆదరిస్తారు. మా సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఫోన్‌ చేసి నన్ను అభినందించడం మరచిపోలేను. కొన్ని పెద్ద పెద్ద బ్యానర్స్‌ నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ కూడా వచ్చాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు